రాయచూరు రూరల్: ఇంకుడు గుంత నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారి గణపతి హెగ్డే పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఆయన పాల్గొని కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడ తవ్విన ఇంకుడు గుంతలను ప్రారంభించి మాట్లాడారు. ఎకర విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే కోట్ల లీటర్లు మేర నీరు భూగర్బంలోకి చేరుతాయన్నారు. ఇంకుడు గుంతల తవ్వకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి మల్లికార్జున, శిల్పా మెడికేర్ విష్ణుకాంత్, నర సింహయ్య, గిరీష్, సిదార్థ, సరస్వతి, హనుమేష్, రమేష్, అన్నపూర్ణ, మురళి, సంధ్య, గురురాజ్, వెంకటేష్ పాల్గొన్నారు.


