సాక్షి,బళ్లారి: ీసమ జాలి(సీంజాలి)గా పిలిచే ఈ మొక్క ఒకప్పుడు పొలాలు, కంచెలకు, వంట చేసేందుకు కట్టెలుగా ఉపయోగపడేది. ముళ్లతో కూడిన జాలి చెట్లను తొలగించేందుకు రైతులు ఎన్నో అవస్థలు పడేవారు. ఇప్పుడు అదే ముళ్లు జాలి చెట్లు రైతుల పాలిట నల్ల బంగారంగా మారాయి. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముళ్ల జాలితో తయారయ్యే బొగ్గుకు మంచి డిమాండ్ ఏర్పడింది.
అమెరికా, మెక్సికో ప్రాంతాల్లో ఉన్న మొక్కను బ్రిటిష్ కాలంలో, లేదా స్వాతంత్రం తర్వాత మన ప్రాంతాల్లో నాటారని కూడా తెలుస్తోంది. ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో కంపచెట్లను వంట చెరకుగా వినియోగించేవారు. కాలక్రమేణా ప్రతి ఇంటా గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. దీంతో కట్టెలు వాడకం దాదాపు తగ్గిపోయింది. మొండి మొక్కగా పేరొందిన ఈ ముళ్ల జాలి ఎంత నరికివేసినా మళ్లీ త్వరగా పెరగడం దీని సహజ స్వరూపం. దీంతో జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్ల మధ్య జాలి పొదలు కనిపించడం సర్వసాధారణంగా మారింది.
జాలి చెట్లతో బొగ్గు తయారీ
ఎక్కడ చూసినా విస్తృతంగా పెరిగే ఈ చెట్లను కొందరు ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. పొలాలు, గట్ల వద్ద పెరిగే జాలి చెట్లను కొనుగోలు చేసి బొగ్గుగా మార్చి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. క్రమంగా ఇది ఒక పరిశ్రమంగా రూపొంతరం చెందింది. బళ్లారి, విజయనగర, చిత్రదుర్గం, కొప్పళ, దావణగెరె పొరుగున ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు తదితర జిల్లాలో కట్టెలనుంచి బొగ్గు తయారు చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ల కొరతతో బొగ్గుకు డిమాండ్
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఏర్పడి వంటగ్యాస్‌కు కొరత ఏర్పడటంతో జాలి చెట్లకు మళ్లీ డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో చాలా మంది పూర్వం తరహాలోనే ముళ్లకంపచెట్లతోనే వంటలు చేస్తున్నారు. మరో వైపు వీటితో తయారయ్యే బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. హోటళ్లు, తందూరి రొట్టెల తయారీకి, ఇసీ్త్ర దుకాణదారులనుంచి బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. ఈ బొగ్గుల వల్ల తక్కువ పొగ రావడమే కాకుండా, ఎక్కువ సేపు మండటం, అధిక వేడి ఇవ్వడం, తక్కువ బరువు ఉండటంతో ఎగుమతులు చేయడానికి ఎంతో మేలు చేస్తుందని బొగ్గు తయారీదార్లు పేర్కొంటున్నారు.
ముళ్ల సీమజాలిచెట్లను జేసీబీలతో తొలగిస్తున్న దృశ్యం
ముళ్ల సీమజాలితో బొగ్గు తయారీ దృశ్యం
ఒకప్పుడు పనికిరానిఈ చెట్లు నేడు ఎంతో మందికి జీవనోపాధి
సీమ చెట్లతో బొగ్గు తయారీ
సిలిండర్ల కొరతతో బొగ్గుకు డిమాండ్


