రాయచూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు శ్రమించాలని జేడీఎస్ కార్యాధ్యక్షుడు, మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ తెలిపారు. దేవదుర్గ తాలూకాలో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తులో జరగునున్న జెడ్పీ, టీపీ, జీపీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, జిల్లాధ్యక్షుడు విరుపాక్షి, శివ శంకర్, మహంతేష్ పాటిల్, నరసింిహనాయక్, అమరేష పాటిల్, సిద్దయ్య పాల్గొన్నారు.
పండిత్ తారానాథ సేవలు అనన్యం
రాయచూరు రూరల్: పండిత తారనాథుడి 135వ జయంతిని శనివారం నగరంలోని హందర్ హైస్కూలులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తారనాథుడి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తారనాథుడు విద్యా, వైద్య రంగాలకు చేసిన సేవలు అనన్యమన్నారు. అనంతరం టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన వారిని సన్మానించారు. అదేవిధంగా ఎల్‌వీడీ కళాశాలలో తారానాఽథుడి విగ్రహనికి టీఎస్‌ఎస్ అధ్యక్షుడు సుఖాణి నివాళులర్పించారు. హందర్ పాఠశాల సమితి అధ్యక్షుడు శరత్ కళస, సభ్యులు పురుషోత్తం ఇన్నాణి, అంభాపతి పాటిల్, శ్రీనివాస్, రాఘవేంద్ర పాల్గొన్నారు.
విద్యార్థినితో ప్రొఫెసర్ ప్రేమాయణం
హుబ్లీ: విద్యాను బోధించే గురువు స్థానం అత్యున్నతమైనదని భారత సంప్రదాయాలు చాటి చెబుతున్నాయి. అయితే విద్యా బోధన చేసే గురువే విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన ఘటన కర్ణాటక విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇక్కడి శాస్యశాస్త్రం విభాగం ఫ్రొఫెసర్ దేవరాజ సంగుదొరై విజయపురకు చెందిన అదే విఽభాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిపారు. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. వీరిద్దరి ప్రేమ గొడవ తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె పీహెచ్‌డీని సంగంలోనే ఆపేసి ఇంటికి తిరిగి తీసుకెళ్లి పోయారు. కొన్ని రోజుల తర్వాత విజయపురకు చెందిన విద్యార్థి తన వద్దకు పీహెచ్‌డీ చేయడానికి రాగా గతంలో మధ్యలోనే పీహెచ్‌డీని ఆపేసి వెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు తీసుకొని వస్తే నీ పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తానని ఆంక్షలు పెట్టారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
జోరుగా హెల్మెట్ల విక్రయాలు
బళ్లారిటౌన్: నగరంలో హెల్మెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. నగరంలో రోడ్డు ప్రమాదాలు అధికం కావడంతో ఈనెల 1నుంచి ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ గట్టి ఆదేశాలను జారీ చేశారు. కేఈబీ సర్కిల్, ఇందిరా సర్కిల్, రాయల్ సర్కిల్, మోతీ సర్కిల్, దుర్గమ్మగుడి సర్కిల్, వాల్మీకి సర్కిల్స్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.హెల్మెట్ లేని వారికి రూ.500 ఫైన్ వేస్తున్నారు.దీంతో బైకిస్టులు హెల్మెట్‌లను కొనుగోలుపై ఆశక్తి చూపుతున్నారు. నగరంలో హెల్మెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక హెల్మెట్ రూ.500 నుంచి వాటి నాణ్యత బట్టి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు.
జల్‌జీవన్ పూర్తిగా విఫలం
● ఎమ్మెల్యేల ఆరోపణ
కోలారు: ఇంటింటికీ జల్‌జీవన్ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయడంతో ప్రభుత్వం విఫలమైందని, దీని వల్ల ప్రజల ప్రశ్నలకు ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పలేకపోతున్నారని శనివారం నగరంలోని జిల్లా పంచాయతీ హాలులో జరిగిన జిల్లా సమావేశంలో ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మంజునాథ్ మాట్లాడుతూ కోలారులోనే పనులు పూర్తి కాలేదు, ఇక గ్రామాలకు వెళ్తే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాదానం చెప్పలేకపోతున్నానని అన్నారు. ఎమ్మెల్యే జీకే వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి సమావేశంలోనూ ఇదే చర్చిస్తున్నారని, సంబంధిత ఇంజనీర్లు కాంట్రాక్టర్‌లతో కలిసి పనిచేయడం లేదని విమర్శించారు. పైప్ లైన్ల పేరుతో రోడ్లను పాడుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో మామిడి ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఎమ్మెలే సమృద్ధి మంజునాథ్ అన్నారు. వారిని కాపాడాలని, దీనిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.


