‘సర్‌’తో లోపరహిత ఓటర్ల జాబితా | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’తో లోపరహిత ఓటర్ల జాబితా

Jun 7 2026 8:42 AM | Updated on Jun 7 2026 8:42 AM

బళ్లారిటౌన్‌: లోపరహిత ఓటర్ల జాబితా తయారీనే సర్‌ ఉద్దేశమని బళ్లారి తాలూకా అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి రాజేష్‌ హెచ్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీన్ని వల్ల అనర్హులు నకిలీ మృతి చెందిన వంటి వారి పేర్లు ఉండకుండా సంపూర్ణ పరిశుద్ధంగా పట్టికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా ఏడాదికి ఒక్కసారి జరిగే జాబితా పరిశీలనకన్నా సర్‌ ప్రక్రియ భిన్నంగా ఉంటుందన్నారు. పట్టికలో ప్రతి పేరును లోతుగా పరిశీలించే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ సారి ఎస్‌ఐఆర్‌ ప్రముఖ మార్పుతో ప్రతి ఓటు ఓటర్‌ను బీఎల్‌ఓలు కలిసి అర్హులను గుర్తిస్తారన్నారు. బూత్‌ స్థాయిలో అధికారులు ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. మరణించిన వారు, ఇతర చోట్లకు వలస వెళ్లిన వారు, ఒకటి కన్న ఎక్కువ చోట్ల పేర్లను నమోదు చేసుకున్న వారిని ఓటర్‌ జాబితా నుంచి తొలగిస్తారన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20 నుంచి 29 వరకు జరుగుతుందన్నారు. జూన్‌ 30 నుంచి జూలై 29 వరకు ఓటర్ల జాబితను తయారు చేయడం, ఆగస్ట్‌ 5 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ఓటర్ల జాబితలో అక్షేపనలు ఉంటే తెలపవచ్చునన్నారు. అంతిమ జాబితాను అక్టోబర్‌ 7న ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్‌ టి.రేఖా, తాలూకా పంచాయతీ ఈఓ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

హొసపేటె: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగుతోందని డిప్యూటి కమిషనర్‌ కవితా ఎస్‌.మన్నికేరి తెలిపారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ పూర్వ కార్యకలాపాలు విజవయవంతంగా జరుగుతున్నాయన్నారు. హడగలి 89.30 శాతం, హగరిబొమ్మనహళ్లి 91.05 శాతం, విజయనగర్‌ 98.58 శాతం, కూడ్లిగి 95.70 శాతం, హరపనహళ్లి 87.58 శాతం పురోగతిని సాధించాయన్నారు. జిల్లాలో 1234 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, వాటిలో 5,65,999 మంది పురుషులు, 5,76,735 మంది మహిళలు, 127 మంది ఇతరులు, మొత్తం 1142861 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతను పాటించేందుకు, బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లకు (బీఎల్‌ఓలకు) సహకరించేందుకు ప్రతి రాజకీయ పార్టీ తమ సొంత బీఎల్‌ఏలను ( బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను) నియమించుకోవాలని సూచించినట్లు తెలిపారు. బీఎల్‌ఓలు ఇళ్లకు వచ్చినప్పుడు తగిన సమాచారం అందించి సహకరించాన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజల అభ్యంతరాలను ఈఆర్‌ఓ స్థాయిలో విని పరిష్కరిస్తారన్నారు. అదనపు జిల్లా కలెక్టర్‌ ఈ బాలకృష్ణ పాల్గొన్నారు.

హుబ్లీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30 నుంచి ఆగస్టు 7 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగనుందని జిల్లా ఎన్నికల అధికారిణి స్నేహల్‌ ఆర్‌ మీడియాకు తెలిపారు. ఈ నెల 20 నుంచి 29 వరకు ఓటర్ల జాబితా తయారీ, శిక్షణ ముద్రణ ప్రక్రియను చేపడుతామన్నారు. బీఎల్‌ఓలు ఈ నెల 30 నుంచి జూలై 29 వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారన్నారు. సదరు ఓటర్ల జాబితాను ఆగస్ట్‌ 5న ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు సమర్పణకు ఆగస్ట్‌ 5నుంచి సెప్టెంబర్‌ 4 వరకు గడువు ఉంటుందన్నారు. ఆగస్ట్‌ 5నుంచి అక్టోబర్‌3 అభ్యంతరాలను స్వీకరిస్తారని, తుది ఓటర్ల జాబితాను ఆగస్ట్‌ 7న ప్రకటిస్తారన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 1665 పోలింగ్‌కేంద్రాలు ఉండగా మొత్తం 16,22,294 ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణకు జిల్లాలో 1665 పోలింగ్‌ కేంద్రాలలో 1665 బీఎల్‌ఓలు, 230 బీఎల్‌ఓ పర్యవేక్షకులను నియమించినట్లు తెలిపారు. ఈ సంపూర్ణ ప్రక్రియ పర్యవేక్షకులుగా జిల్లా నోడల్‌ అధికారిగా కేఎస్‌ఎన్‌ఎల్‌ ముఖ్య పాలన అధికారి ఎస్‌ఎన్‌ రుద్రేశ్‌ను నియమించామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement