● కార్మికునికి తీవ్రగాయాలు
భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని ఎంఎస్‌ఎన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌లో కెమికల్ నింపుతుండగా ఆకస్తాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే గాయపడ్డ కార్మికులను కామారెడ్డిలో పలు ఆస్పత్రులకు తరలించారు. అందులో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. సదరు కార్మికునికి హైదరాబాద్‌లో శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయాన్ని ఎవ్వరికి చెప్పవద్దని డ్యూటీలో ఉన్న కార్మికులను సిబ్బంది హెచ్చరించినట్లు తెలిసింది.
మోస్రా మండల కేంద్రంలో..
వర్ని: మోస్రా మండల కేంద్రంలో జరిగిన రో డ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రా మానికి చెందిన శ్రీను, సురేష్ బైక్‌పై నిజామాబాద్ నుంచి వర్ని వైపు బయలుదేరారు. మోస్రాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శంకర్‌ను వీరు ఢీకొట్టారు.ఈఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని చికిత్స నిమి త్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.


