వెన్నుపోటు పొడిచారు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పొడిచారు

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

చేపల వేట ద్వారా జీవనోపాఽధి పొందుతున్న మత్స్యకారులు రెండు నెలల పాటు ఇంట్లో ఖాళీగా ఉండి పస్తులున్నారు. వేట విరామ సమయంలో ఇచ్చే భృతికి ప్రభుత్వం 2024లో ఎగనామం పెట్టింది. తరువాతి సంవత్సరం కోత విధించింది. ఈ ఏడాది చాలా మందికి భృతి అందలేదు. పెద్ద బోట్లకు రాయితీ డీజిల్‌ వినియోగించలేదనే కారణంతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.

– బొడ్డు సత్యనారాయణ,

మత్స్యకార నాయకుడు, తూరంగి

రాయితీ డీజిల్‌ సాకుతో...

రాయితీ డీజిల్‌ను సాకుగా చూపిస్తూ సముద్రంపై చేపల వేట చేస్తున్న అసలైన లబ్ధిదారులకు మొండిచేయి చూపించారు. చేపల వేట నిషేదం ముగుస్తున్నా నేటికీ కొంతమందికి మత్స్యకార సేవ లబ్ధి అందలేదు. కోనసీమ జిల్లాలో మత్స్యశాఖ అధికారులు బోటు ఫొటో గుర్తింపు సర్వే చేపట్టి 12,016 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్థిదారులు, కరెంటు బిల్లులను సాకుగా చూపించి కనీస సమాచారం లేకుండా 388 మందిని తొలగించారు. జిల్లాలోని 67 మెకనైజ్డ్‌ బోట్లకు చెందిన 483 మంది లబ్ధిదారులకు మత్స్యకార భరోసా జమ చేయలేదు.

– మల్లాడి వీరబాబ్జీ, మత్స్యకార

నాయకుడు, మాజీ సర్పంచ్‌, పల్లం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement