టేబుల్‌ టెన్నిస్‌ పోటీల రెండో రోజు విజేతలు వీరే.. | - | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌ పోటీల రెండో రోజు విజేతలు వీరే..

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

సామర్లకోట: పెద్దాపురం శ్రీ ప్రకాష్‌ సినర్జీ పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ పోటీల్లో రెండో రోజు శనివారం విజేతల వివరాలను ఆంధ్రప్రదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.విశ్వనాథ్‌ ప్రకటించారు. అండర్‌ – 11 బాలికల విభాగంలో మిషిక గోవిందరాజు (డీటీటీఎ) ప్రథమ, గీతి ఆప్రోజ్‌ (ఫన్‌ టైమ్స్‌) ద్వితీయ, బాలుర విభాగంలో వీర సాత్విక్‌ (ఫన్‌ టైమ్స్‌) ప్రథమ, పల్లా మహాసవిన్‌ (ఫన్‌ టైమ్స్‌) ద్వితీయ స్థానాల్లో నిలిచారు.

ఫ అండర్‌ – 13 బాలిక విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్‌ టైమ్స్‌), బాలుర విభాగంలో జె.వైభవ్‌, జి.తరుణ్‌ తేజ (ఫన్‌టైమ్స్‌) వరుస స్థానాల్లో నిలిచారు.

ఫ అండర్‌ – 15 విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్‌ టైమ్స్‌), బాలుర విభాగంలో ఎన్‌.వేదాంశ్‌ (ఫన్‌టైమ్స్‌), నల్ల మోక్షజ్ఞ తేజ (రైజ్‌) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ విజయ్‌ ప్రకాష్‌, కార్యదర్శి విశ్వనాథ్‌ బహుమతులు అందజేశారు. ఈ పోటీలను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన చీఫ్‌ రిఫరీ సింగరాజు, అసిస్టెంట్‌ చీఫ్‌ రిఫరీ డీవైఎస్‌వై శర్మ, ఇతర అంపైర్లను అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement