ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి

Jun 15 2026 12:47 AM | Updated on Jun 15 2026 12:47 AM

ఎర్రవల్లి: ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం మండలంలోని పుటాన్‌దొడ్డిలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. గ్రామ పంచాయతీల సమగ్ర ప్రగతి ద్వారానే రాష్ట్రం, దేశాబివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నూత నంగా అందుబాటులోకి వచ్చిన పంచాయతీ భవనాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో మౌలిక సదు పాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నీలి శ్రీనివాసులు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ రంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ హనుమంతురెడ్డి, సర్పంచ్‌ నారాయణ, ఉపసర్పంచ్‌ విజయలక్ష్మి, నాయకులు పరమేశ్వర్‌రె డ్డి, మహేశ్వర్‌రెడ్డి, పరందామిరెడ్డి, రాముడు, మద్దిలేటి, బీసన్న పాల్గొన్నారు.

పాలమూరు రెడ్‌క్రాస్‌కు మొదటి బహుమతి

పాలమూరు: రాష్ట్రంలో అత్యధికంగా 7323 యూనిట్ల రక్త నిల్వలు సేకరించి మొదటి స్థానంలో నిలిచిన మహబూబ్‌నగర్‌ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రానికి ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా చేతులమీదుగా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌ బహుమతి అందుకున్నారు. 2025– 26 సంవత్సరంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, రక్తమార్పిడి సేవలలో విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. గత 24 ఏళ్లుగా రక్త సేకరణలో మహబూబ్‌నగర్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రం అగ్రస్థానంలో నిలుస్తుందని నటరాజ్‌ వెల్లడించారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు అమర్‌రాజా ఈఎస్‌ఎస్‌సీఐ ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ సెంటర్‌ మేనేజర్‌ ఆనంద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ సర్వీస్‌, ఏసీ టెక్నీషియన్‌ రంగాల్లో 90 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనునట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నంబర్లు 73034 44397, 73034 44561లను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement