టెట్‌ వాయిదా వేయాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ వాయిదా వేయాలి

Jun 15 2026 12:47 AM | Updated on Jun 15 2026 12:47 AM

అయిజ: రాష్ట్రంలో ఈ నెల 17న నిర్వహించే టెట్‌ను వాయిదా వేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. ఆదివారం అయిజలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టెట్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షలు ఒకే రోజు ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని టెట్‌ను వాయిదా వేయాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ అధ్యక్షుడు భగత్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్‌, భీమన్న ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement