ఆదిశిలా క్షేత్రంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ఆదిశిలా క్షేత్రంలో న్యాయమూర్తి ప్రత్యేక పూజలు

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

మల్దకల్‌: ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం గద్వాల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేష్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు, చైర్మన్‌ జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారిని శేషవస్త్రంతో సత్కరించి మెమోంటోను బహూకరించారు. వారి వెంట అర్చకులు ధీరేంద్రదాసు, మధుసూదనాచారి, శశాంక్‌, చంద్రశేఖర్‌రావు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.

జూరాలకు 2,596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్‌ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు.

ఆర్టీసీ విలీనానికి

ఉన్నత స్థాయి కమిటీ

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్‌టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్‌ఎం సంతోష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం తన చాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్‌లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్‌ సబ్‌ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement