సలహాలతో సాగు.. లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

సలహాలతో సాగు.. లాభాలు బాగు

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

ప్రశ్న: ఎనిమిదేళ్ల నుంచి పత్తి పంట వేస్తున్నాం. దిగుబడులు ఎందుకు ఎక్కువగా రావడం లేదు.?

– శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌ (గద్వాల), రాజు, తిమ్మన్న (ధరూర్‌)

డీఏఓ : ఎప్పుడూ ఒకే రకమైన పంట వేయరాదు. దీని వల్ల దిగుబడులు ఎక్కువగా రావు. పంట మార్పిడి చేయాలి. వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి.

ప్రశ్న: విత్తనాలు కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? – రాజేష్‌,

వెంకట్‌రెడ్డి (గద్వాల), రాముడు, గోవిందు (అయిజ), గోపాల్‌, భీమేష్‌నాయుడు, ఆంజనేయులు (మానవపాడు)

డీఏఓ : లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్ద మాత్ర మే విత్తనాలు కొనుగోలు చేయాలి. సీల్‌ ఉన్న పాకెట్‌ను తీసుకోవాలి. ఎక్స్‌పైరీ తేదీ గమనించాలి. రశీదు తప్పక తీసుకొని, పంట పూర్తయ్యే వరకు జాగ్రత్తగా దాచుకోవాలి.

గద్వాల వ్యవసాయం: ‘జిల్లాలో ఇప్పటి వరకు ఇంకా సాధారణ వర్షపాతమే నమోదు కాలేదు. తొందరపడి విత్తనాలు వేయొద్దు. జూలై 15 వరకు వేయడానికి అవకాశం ఉంటుంద’ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విత్తనాల ఎంపిక, వాడకం, విత్తనశుద్ధి, దుక్కులు సిద్ధం చేసిన తర్వాత చేయాల్సిన పని, ఏయే భూముల్లో ఏ రకమైన పంటలు వేయాలి.. తదితర అంశాలపై రైతులకు సలహాలు, సూచనలు అందించారు. రైతులు అధికారుల సలహాలు తీసుకొని పంటలు సాగు చేస్తే.. మంచి దిగుబడులతో లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

ప్రశ్న: విత్తనాలు వేయక ముందు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలి.?

– వెంకటేష్‌, రంగన్న (గట్టు), రామకృష్ణ, మధుబాబు (మల్దకల్‌), నర్సింహులు, రాజు (కేటీదొడ్డి)

డీఏఓ : పాత పంటను పూర్తిగా తొలగించాలి. లోతు దుక్కులు వాలుకు అడ్డంగా దున్నాలి. దీనివల్ల పురుగుల అవశేషాలు చనిపోతాయి. పురుగుల బెడద తగ్గుతుంది. ఆ తర్వాత ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువును వేయాలి. వరి పంటకు అయితే పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనుము, పిల్లి పెసర వేయాలి.

ప్రశ్న: ఏ నేలలో.. ఏ రకమైన పంటలు వేయాలి.? – హన్మంతు, సురేష్‌ (గట్టు),

శ్రీరాములు, నర్సింహ (గద్వాల)

డీఏఓ : నల్లరేగడి భూముల్లో పత్తి, మిరప, నూనె గింజలు వేయాలి. కందిపంట వేసి అంతర పంటగా పెసర వేయవచ్చు. ఎర్రటి నేలల్లో సాగునీరు అందుబాటులో ఉంటే పత్తి, ఉల్లి, నూనె గింజలు, కంది సాగు చేయవచ్చు. ఇసుక నేల ల్లో పత్తి, మిరప, పప్పు దినుసులు పండించవచ్చు.

ప్రశ్న: జిల్లాలో అందుబాటులో ఉన్న పత్తి విత్తనాల రకాలు.?

– నర్సింహారెడ్డి, పాండురెడ్డి (గద్వాల), త్రివిక్రమ్‌, గోపాల్‌రెడ్డి (అయిజ), దేవదాసు,ఆంజనేయులు (శాంతినగర్‌)

డీఏఓ : సదానంద, మైకో, యూఎస్‌, ఆద్య తదితర వాటితోపాటు పలు రకాల పత్తి విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్న: నాలుగేళ్ల నుంచి ఏ పంట వేసినా ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. ఎందుకు?

– కృష్ణవర్ధన్‌రెడ్డి, మనోహర్‌ (గద్వాల), రామకృష్ణ, కోటేష్‌ (ఇటిక్యాల)

డీఏఓ : మీరు నాలుగేళ్లుగా వేసిన పంటల వివరాలు, వాడిన ఎరువులు, మందుల వివరాలు ఏఈఓల దృష్టికి తీసుకెళ్లండి. రైతులందరూ వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు

తీసుకోవాలి.

ప్రశ్న: పంట పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి.. తగ్గించడానికి గల మార్గాలు తెలియజేయండి..? – రాకేష్‌, (గద్వాల)

డీఏఓ : పంట పెట్టుబడుల్లో ప్రధానంగా ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులకు ఖర్చు చేస్తున్నారు. వీటికి బదులుగా సేంద్రియ ఎరువులు వినియోగించాలి. అదేవిధంగా పాత పద్ధతులు కాకుండా నూతన వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి. పంటలకు ఏ మందులు వేయాలన్నా విస్తరణాధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి.

టీజీ టీ–20 లీగ్‌లో మనోళ్లు

ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీ టీ–20 క్రికెట్‌ లీగ్‌కు ఉమ్మడి పాలమూరుకు చెందిన నలుగురు క్రికెటర్లు ఎంపికయ్యారు.

–8లో u

సకాలంలో వర్షాలు రాకపోతే ఆరుతడి పంటలు వేయాలి

జిల్లాలో అందుబాటులో ఎరువులు, విత్తనాలు

లైసెన్స్‌డ్‌ డీలర్లతోనే విత్తనాలుకొనుగోలు చేయాలి

యూరియాకు బదులుగా నానో యూరియా వినియోగించండి

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌లో జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప

ప్రశ్న: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఏ సమయం వరకు విత్తనాలు వేసుకోవచ్చు.?

– రాధాకృష్ణ, తిమ్మోతి (ధరూర్‌), వాసు, కృష్ణ, అంజి (వడ్డేపల్లి), రాజనర్సింహ, గోపాల్‌ (ఉండవెల్లి)

డీఏఓ : వర్షాలు ఇంకా ఆరంభం కాలేదు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు భూమి పదును కాలేదు. రైతులు తొందరపడరాదు. జూలై 15 వరకు విత్తనాలు వేయవచ్చు. జూలై 15 వరకు కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే ఏయే రకమైన పంటలు వేయాలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతారు. వారి సలహాల ప్రకారం పంటలు వేయండి.

ప్రశ్న: జిల్లాలో సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా.?

– రాధాకృష్ణ, మాధవ్‌ (మల్దకల్‌), గోపాల్‌, భీంసేన్‌రెడ్డి (ఎర్రవల్లి)

డీఏఓ : జిల్లాలో అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో 1,11,922 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని అంచనా వేశాం. అయితే ఇప్పుడు 50,318 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువుల కొరత రాకుండా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకుంటాం. నానో యూరియాతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. యూరియాకు బదులుగా నానో యూరియాను వాడండి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement