చాలామంది చిన్నపాటి విషయాలకే మనోవేదనకు లోనవుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు జరగకుండా సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ఇతర మేధావులు ఆత్మహత్యల ద్వారా చిన్నాభిన్నమైన కుటుంబాలు లేకుండా.. ఆత్మహత్యలు లేని సమాజ నిర్మాణానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి దీనిపై శ్రద్ధ పెడితే.. ఆత్మన్యూనతా భావంతో.. క్షణికావేశంతో ఆసువులు బాస్తున్న వారిని రక్షించుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. నానాటికి క్షీణించి పోతున్న మౌళిక విలువలు.. పెరుగుతున్న మానసిక సంఘర్షణ ఆత్మహత్యలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మానవ సంబంధాలు బలహీనంగా మారే వాతావరణంలో సకారాత్మక మార్పులు తీసుకురావడం.. జీవన విధానంలో పలు కారణాలతో ఏర్పడుతున్న అగాధాలను పూడ్చడం.. సామాజిక తోడ్పాటు ద్వారా ఆత్మహత్యలు పూర్తి తగ్గుతాయి. – వంగీపురం శ్రీనాథచారి, ప్రముఖ మానసిక విశ్లేషకులు


