రసాయన ఎరువుల వాడకం తగ్గించండి | - | Sakshi
Sakshi News home page

రసాయన ఎరువుల వాడకం తగ్గించండి

Jun 11 2026 8:17 AM | Updated on Jun 11 2026 8:17 AM

అయిజ: రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ ఎరువులు వినియోగించాలని ఆత్మ డిప్యూటీ డైరెక్టర్‌ జగ్గూ నాయక్‌ సూచించారు. బుధవారం అయిజ మండలం ఈడుగోనిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై.. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను అధికంగా వినియోగించడం ద్వారా పంట పొలం సహజ లక్షణం కోల్పోయి నిస్సారంగా మారుతుందన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించవ్చన్నారు. రైతులు నానో డీఏపీ, యూరియాపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మంజుల, ఉపసర్పంచ్‌ గోవిందమ్మ, ఏఓ జనార్దన్‌, ఏఈఓ అనిల్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి సురేంద్ర పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో

సమగ్రాభివృద్ధి

గద్వాలన్యూటౌన్‌: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం బీజేపీ నాయకులు స్థానిక కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా పరిపాలించిన ప్రధానిగా మోదీ కొత్త చరిత్ర సృష్టించారన్నారు. 12 ఏళ్ల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, డిజిటల్‌ విప్లవం, జాతీయ భద్రత బలోపేతం, ఆర్థిక రంగంలో సంస్కరణల ద్వారా దేశం సరికొత్త దిశగా పయనిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎక్బోటే రవి, శ్యామ్‌రావు, కౌన్సిలర్లు చంద్రశేఖర్‌, శాలన్న, నాయకులు శ్రీమన్నారాయణ, సమత, కృష్ణ, పాండు, నర్సింహ పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.6,279

గద్వాలవ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 500 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,360, కనిష్టంగా రూ. 3,119, సరాసరి రూ. 6,279 ధరలు లభించాయి. 4 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. రూ. 1,875 ధర పలికింది.

ముందు ప్రభుత్వంలో విలీనం చేయండి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: టీజీఎస్‌ఆర్‌టీసీని ముందుగా ప్రభుత్వంలో విలీనం చేసి, ‘అపాయింటెడ్‌ డే’ ప్రకటించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలో సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలుత కార్మిక సంఘాల ఎన్నికలు జ రపాలని భావించడం సరైన నిర్ణయం కాదన్నా రు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే విలీనం జరగాలన్నారు. గత నెలలో సమ్మెకు ముందు కార్మికుల్లో ఏ మాత్రం బలం లేని జేఏసీ నోటీసు ఇవ్వడంతో ఎలాంటి చల నం రాలేదని, దీంతో మెజారిటీ ఉన్న టీఎంయూ ఆధ్వర్యంలో 16 డిమాండ్లతో నోటీసు ఇచ్చి సమ్మెలోకి వెళ్లామన్నారు. సమ్మె ఉద్ధృతమైన క్రమంలో రెండోరోజే డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఆత్మాహుతి చేసుకోవడం దురదృష్టకరమన్నా రు. చివరకు టీఎంయూ కార్మికుల బలంతోనే సమ్మె విజయవంతమైందని, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను అంగీకరించిందన్నారు. ఇది భరించలేని జేఏసీ నాయకులు ‘ముందే విలీనం వద్దు.. గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి..’ అని ప్రభుత్వాన్ని తాను కోరినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ రెడ్డి, రీజియన్‌ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వీసీఎస్‌ రెడ్డి, రవి, బీవీ రెడ్డి, నారాయణ, నాయకులు శ్రీనివాసులు, భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా అడ్‌హాక్‌ కమిటీ చైర్మన్‌గా సంజీవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చంద్రయ్య, అధ్యక్షుడిగా వి.ఎస్‌.నారాయణ, రీజినల్‌ కార్యదర్శిగా మధుసూదన్‌, అదనపు కార్యదర్శిగా బి.శ్రీనివాసులును ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement