రాజోళి: కొన్నేళ్లుగా గట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ ధ్రువపత్రాల దందాను కొన్ని నెలల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. నకిలీ పత్రాలతో మోసపోయిన బాధితులు జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదులు సైతం చేశారు. అయినప్పటికీ నకిలీగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యధోరణి కారణంగానే దొంగచాటుగా చేసే ఫేక్ సర్టిఫికెట్ల దందా.. ప్రస్తుతం యథేచ్ఛగా దుకాణాల్లోనే నిర్వహించే దాక వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లతో తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని జిల్లా అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క..
రాజోళి మండలం మాన్‌దొడ్డి కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అయిజలోని పలు ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క.. ఫేక్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. ఫేక్ సర్టిఫికెట్లతో ఒకరి ఇంటిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు సాక్షుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. దీనిపై బాధితుడు గతేడాది జూన్‌లో అధికారులకు పిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఫేక్ సర్టిఫికెట్లు తయారీ చేసిన వ్యక్తి.. అది చేసింది తానేనని మాట్లాడిన ఫోన్ సంభాషణ ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రైవేటు బ్యాంకుల్లో ఇంటి రుణాలు ఇప్పిస్తే వచ్చే కమీషన్ కోసం, సాధారణ నిరక్ష్యరాసులను లక్ష్యంగా చేసుకొని రుణాల మాయలో పడేస్తున్నారు. సర్టిఫికెట్లు లేని వారి వద్ద కావాల్సినంత డబ్బు దండుకొని నకిలీ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లు, ఇతర తతంగం ముగిస్తున్నట్లు తెలిసింది.
ఇతర మండలాల్లో సైతం..
మాన్‌దొడ్డిలో మొదటి నుంచి ఓ వ్యక్తి ఓనర్‌షిప్ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా.. ఆయన ద్వారా మరికొందరు లింకులు కలుపుకొని పచ్చర్ల, రాజోళి, తుమ్మిళ్ల, శాంతిగనర్, మానవపాడు తదితర గ్రామాలతో పాటు, గట్టు మండలం వరకు ఫేక్ మేకర్లు తయారయ్యారు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారనేది అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా, అదే సర్టిఫికెట్లతోనే ప్రక్రియను ముగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా గ్రామ పంచాయతీ నుంచి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గతంలో ఓనర్‌షిప్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఓనర్‌షిప్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కాని అదే ఓనర్‌షిప్ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి.. వందల రిజిస్ట్రేషన్లు చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఓనర్‌షిప్ సర్టిఫికెట్లను తాము ఇవ్వలేదని గ్రామ పంచాయతీ అధికారులే చెబుతున్నా.. అందుకు ఆధారాలతో సహా రాతపూర్వకంగా రాసి ఇచ్చినా కూడా కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు.
ప్రాణం ఖరీదు..
వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందిన ఓ మహిళ కుటుంబానికి రూ.9.50 లక్షల పరిహారం చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.
–8లో u
సంతకాలు ఫోర్జరీ..
గతేడాది పచ్చర్లకు చెందిన వ్యక్తి ఇంటిని ఫేక్ సర్టిఫికెట్లతో మరొకరికి అమ్మారని తెలుసుకున్న బాధితుడు.. ఆధారాలతో సహా జిల్లా అధికారులకు తెలిపారు. ఈ మేరకు మండల అధికారులు విచారణ జరపగా.. గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని నిర్ధారణ అయ్యింది. ఫోర్జరీలు చేసిన వ్యక్తులు కూడా ఇతరులు చేయమంటేనే చేశామని చెప్పా రు. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో విసిగిపోయిన బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇలా గ్రామస్థాయి నుంచే ఫేక్ మేకర్లు విచ్చలవిడిగా దందా సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
ప్రైవేటు బ్యాంకర్లతో కుమ్మకై ్క ఫేక్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్ల దందా
బాధితులు ఫిర్యాదు చేసినా
పట్టని అధికారులు
ఇతర గ్రామాలకు పాకుతున్న ఫేక్ మేకర్లు
యథేచ్ఛగా నకిలీ ధ్రువపత్రాల తయారీ


