పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలోపాటు పాలమూరు మెడికల్ కళాశాల లో పనిచేస్తున్న అన్నివిభాగాల హెచ్‌ఓడీలు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. మొత్తం 9 విభాగాల ప్రొఫెసర్ల (హెచ్‌ఓడీ)లకు స్థానం చలనం కావడం విశేషం. మత్తు విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ మాధవి ఉస్మానియా, రేడియాలజీ విభాగం హెచ్‌ఓడీ హన్మంతు ప్రసాద్ గాంధీ ఆస్పత్రి, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీకాంత్ కోఠి, చిన్నపిల్లల విభాగం (పీడియాట్రిక్) హెచ్‌ఓడీ డాక్టర్ సురేష్ శ్రీనివాస్ నిలోఫర్, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ అమరావతి ఉస్మానియా, ఎస్‌పీఎం హెచ్‌ఓడీ డాక్టర్ ఉషారాణి ఉస్మానియా, ఫిజియాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ సునందిని ఉస్మానియా, ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ పార్వతి ఉస్మానియా, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ రమాదేవి నిలోఫర్‌కు బదిలీ అయ్యారు. అదేవిధంగా జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీపద్మప్రియ నారాయణపేట, జనరల్ మెడిసిన్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ స్వప్న ఉస్మానియాకు, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ నాగర్‌కర్నూల్‌కు బదిలీ అయ్యారు. ఇక జిల్లాకు వచ్చిన వారిలో ఎస్‌పీఎం హెచ్‌ఓడీగా డాక్టర్ కోటేశ్వరమ్మ గాంధీ నుంచి బదిలీపై వచ్చారు. మైక్రోబయాలజీ హెచ్‌ఓడీగా డాక్టర్ శ్రీవాణి, జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడీగా డాక్టర్ శకుంతల రావడం జరిగింది.
కొత్తవారు ఎప్పుడో..?
జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలోని ఆయా విభాగాల్లో పనిచేసే హెచ్‌ఓడీలు (ప్రొఫెసర్లు) బదిలీ కావడంతో సదరు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారు వచ్చి విధుల్లో చేరే వరకు ఎన్ని రోజులు పడుతుందనే విషయం తెలియడం లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి వచ్చే వారిలో ఇక్కడ విధుల్లో చేరడానికి ఆసక్తి చూపారు. ఒకవేళ చేరిన నిత్యం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా వారు అందుబాటులో ఉండే అవకాశం లేదు.
డీఎంహెచ్‌ఓ కృష్ణ బదిలీ
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయడం జరిగింది. అలాగే డీఎంహెచ్‌ఓగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కృష్ణ నాగర్‌కర్నూల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో జిల్లాకు ఇంకా ఎవరిని కేటాయించలేదు. అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిగా డాక్టర్ సునీతరెడ్డి వికారాబాద్ నుంచి బదిలీపై వచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ)గా డాక్టర్ శైలజ నారాయణపేట నుంచి బదిలీపై వచ్చారు. ఇక పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఫార్మాసిస్ట్‌లు, 24 మంది ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఎంపీహెచ్‌ఓలు, నలుగురు హెల్త్ ఎడ్యుకేటర్లు, సూపర్‌వైజర్లు, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీహెచ్‌ఓలు బదిలీ కావడం జరిగింది. కిందిస్థాయి సిబ్బందికి జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ ఇవ్వగా.. కొందరు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు.
రోగులకు దిక్కెవరు..?
ప్రస్తుతం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్‌లు, అసిస్టెంట్‌లకు బదిలీ అయిన నేపథ్యంలో కొత్త వారు వచ్చి విధుల్లో చేరడానికి ఇంకా సమయం పట్టనుంది. అలాగే కొంతమందిని ఇక్కడికి బదిలీ చేసిన విధుల్లో చేరడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు అవస్థలు తప్పవు. అందరూ విధుల్లో ఉన్న రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవారు ప్రస్తుతం అందరూ బదిలీ హడావుడిలో ఉండటంతో రోగులను పట్టించుకునే నాథుడే ఉండరు. దీంతో అడ్మిట్ అయిన రోగులతోపాటు అవుట్ పేషెంట్లకు మెరుగైన చికిత్స అందడం కష్టసాధ్యమే అనిపిస్తోంది.
9 విభాగాల హెచ్‌ఓడీలు, అసోసియేట్‌లకు స్థానచలనం
డీఎంహెచ్‌ఓ కృష్ణ నాగర్‌కర్నూల్‌కు..
ఆరోగ్య శాఖలో వైద్యాధికారులు,ఏఎన్‌ఎంలు అందరూ బదిలీ
జనరల్ ఆస్పత్రిలో కొత్త వైద్యులు విధుల్లో చేరే వరకు రోగులకు తప్పని అవస్థలు


