● నెట్టెంపాడుకు కొనసాగుతున్న నీటి పంపింగ్
గద్వాల (ధరూరు): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కు స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,815 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపా రు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నెట్టెంపాడుకు 1,500 క్యూ సెక్కులు, ఆవిరి రూపంలో 42 క్యూసెక్కులతో కలి పి మొత్తం 1,542 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.372 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.


