జిల్లాలోని ప్రతి క్లస్టర్‌లో రైతువేదికలు ఉన్నాయి. వ్యవసాయ, విస్తరణ అధికారులు సమయానికి రైతులకు అందుబాటులో లేక రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. గ్రామీణ రైతులు పంటలను ఏ సమయంలో వేయాలి.. ఏయే పంటలు వేయాలో అడిగే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుతం అధికారులందరూ ప్రతి సమావేశంలోనూ ఆయిల్‌పాం పంటను అధికంగా సాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు నల్లరేగడి పొలాల్లో బోర్లు లేని పరిస్థితుల్లో డిమాండ్లు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌పాం సాగుకు మాత్రమే అవగాహన కల్పిస్తే.. మిగతా పంటల పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో అధికంగా పత్తి 2.20 లక్షల ఎకరాల్లో, వరి లక్ష ఎకరాల్లో, మొక్కజొన్న 30 వేల ఎకరాల్లో, వివిధ పంటలు కూడా సాగవుతుండగా.. వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో రైతులకు ఎలాంటి సూచనలు అందడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంట సాగు, ఎరువుల వాడకం తదితర వాటిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
ఉండవెల్లి: తొలకరి జల్లులు కురవగానే రైతులు విత్తనాలు నాటడంలో నిమగ్నమవుతారు. అయితే ఈసారి వానాకాలంలో ‘ఎల్‌నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ముందస్తుగా విత్తనాలు నాటితే ఆ తర్వాత వర్షాలు కురవక రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీనిపై పెద్దగా అవగాహన లేని రైతులు ఇప్పటికే కురిసిన వర్షాలకు అక్కడక్కడ విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు రైతులకు అవగాహన కల్పించడంలోనూ జిల్లా వ్యవసాయశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
వ్యవసాయమే జీవనాధారం..
నడిగడ్డ అంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు. 90 శాతానికిపైగా రైతులకు జీవనాధారం. ఈ ఖరీఫ్ సీజన్‌లో 3.75 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అదే జరిగితే రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. గతేడాది మే 26న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా.. ఈసారి కాస్త ఆలస్యంగా ఈ నెల రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో కురవాల్సిన సమయంలో కాకుండా.. ఒకేసారి భారీ వర్షం కురిసి.. పెద్దఎత్తున వరదలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని, అలాంటి పరిస్థితి ఆగస్టు 15 వరకు జరిగితే యథావిధిగా వరిసాగు, పత్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాబట్టి సాగు పద్ధతులు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అక్టోబర్ 202.1 198.5
ఇటీవల కురిసిన వర్షాలతో విత్తనాలు నాటుతున్న రైతాంగం
రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం
సాగు పద్ధతులు మార్చుకోవాలని నిపుణుల సూచన
జిల్లాలో 3.75 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా


