పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలి మోటార్‌లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన, చిత్తశుద్ధి లేవన్నారు. నగరంలోని రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను ఎంపీ ప్రారంభించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పినా పూర్తి చేయలేదని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో నిధులు ఇచ్చింది లేదని విమర్శించారు. జిల్లా నుంచి గెలుపొందిన సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై చేసింది ఏం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్పా అర్హులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకు స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో భారీగా నిర్వహించాలన్నారు. తెలంగాణ మొత్తాన్ని కాషాయమయం చేస్తామనే సంకల్పబలంతో ముందుకు వెళ్లాలన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ దొచుకుందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే రోజు తొందరలో వస్తుందన్నారు. రాష్ట్ర వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, బాలరాజు, రాములు, రమేష్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా బాల కేంద్రంలో సుమారు నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం–విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి సాంస్కృతిక శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఇందులో శిక్షణ పొందిన చిన్నారులు చివరిరోజు రాత్రి స్థానిక బా దం రామస్వామి గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో ప్రదర్శలిచ్చారు. ముఖ్యంగా వీరి సంప్రదాయ నృత్యాలు ఆహూతులను ఎంతగా నో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బాల కేంద్రం ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రాజేష్‌ఖన్నా, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
● రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారు
● ఎంపీ డీకే అరుణ


