‘గుడ్డెందొడ్డి’ని 15 టీఎంసీలకు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

‘గుడ్డెందొడ్డి’ని 15 టీఎంసీలకు పెంచాలి

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

సీఎంకు ఘన స్వాగతం..

గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 11 లేదా 15 టీఎంసీలకు పెంచా లని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కృష్ణాబేసిన్‌లో తొలి ప్రాజెక్టు జూ రాల అని, వానాకాలంలో వేల టీఎంసీల వర ద వస్తున్నా.. వాటిని ఒడిసిపట్టుకోవడానికి సరిపడా జలాశయాలు లేని కారణంగా అవన్నీ వృథా గా పోతున్నాయన్నారు.జూరాల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ద్వారా చేపట్టిన నెట్టెంపాడు ఎత్తిపోతలలో నిర్మించిన గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంచితే జిల్లాలోని ప్రాజెక్టులకే కాకుండా.. ఉమ్మడి పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులకు సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని వివరించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి గుడ్డెందొడ్డి పంపుహౌస్‌ను ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి చూపించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పీపీటీ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా ప్రాజెక్టుల గురించి సాగునీటి పారుదల శాఖ అధికారులు క్షుణ్ణంగా వివరించారు.ఇందులో ప్రధానంగా జూ రాల ప్రాజెక్టు, ఆర్డీఎస్‌, నెట్టెంపాడు ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతుల గురించి దృశ్యరూపంలో అవగాహన కల్పించారు. అలాగే ఆర్డీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో మల్లమ్మకుంట రిజర్వాయర్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియపై అధికారులు వివరాలు తెలియజేశారు.

పటిష్ట బందోబస్తు..

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెలీప్యాడ్‌ నుంచి గు డ్డెందొడ్డి పంపుహౌస్‌ వరకు అడుగడుగునా పోలీ సు బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో గుడ్డెందొడ్డి పంపుహౌస్‌ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి అక్క డే ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ.. కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమం అనంత రం తిరిగి వెళ్లే సమయంలో మీడియా ప్రతినిధులను పలకరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మంత్రి బోసురాజు, కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సరిత, అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ రహీముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

పంపుహౌస్‌ను పరిశీలించిన

సీఎం రేవంత్‌రెడ్డి

జిల్లా ప్రాజెక్టులపై ఫొటో ఎగ్జిబిషన్‌, పీపీటీ ప్రజెంటేషన్‌

గంటపాటు ప్రాజెక్టులపై

వివరాలు తెలుసుకున్న సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం 4.49 గంటలకు గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ వద్దకు హెలీకాప్టర్‌లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పూలబొకేతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు గట్టు తిమ్మప్ప, సరిత తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుడ్డెందొడ్డి పంపుహౌస్‌ వద్దకు చేరుకుని ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వివరాలను ఎమ్మెల్యే బండ్ల, సాగునీటి పారుదల శాఖ అధికారులు సీఎంకు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement