పల్లీ @ రూ.7,239 | - | Sakshi
Sakshi News home page

పల్లీ @ రూ.7,239

Jun 5 2026 4:17 AM | Updated on Jun 5 2026 4:17 AM

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు గురువారం 112 క్వింటాళ్ల వేరుశనగ రాగా..గరిష్టంగారూ. 7,239,కనిష్టంగా రూ.3,699, సరాసరిగా రూ.6,154 ధర లు లభించాయి. ప్రస్తుతం అన్నిరకాల సీజన్లు ముగియడంతో వేరుశనగా మాత్రమే విక్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అరకొరగా డిగ్రీ సీట్ల భర్తీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూ పరిధిలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ ప్రక్రియ ప్రభుత్వం దోస్తు వెబ్‌సైట్‌ ద్వారా చేపట్టింది. ఇప్పటికే రెండు దశల్లో ప్రక్రియ ముగిసింది. సీటు అలాట్‌మెంట్‌ అనంతరం విద్యార్థులు సంబంధిత కళాశాల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేందుకు శుక్రవారం అవకాశం కల్పించింది. పీయూ పరిధిలో 65 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉండగా వీటిలో 27,720 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని కళాశాలల్లో కలిపి 2,487 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ క్రమంలో మొదటి దశలో 3,292 మంది విద్యార్థులకు సీటు అలాట్‌మెంట్‌ చేయగా, ఇందులో 2,157 మంది కళాశాలల్లో రిపోర్టు చేశారు. రెండో దశలో 3,315 మందికి సీటు అలాట్‌మెంట్‌ చేయగా.. ఇందులో 330 మంది మాత్రమే గురువారం సాయంత్ర వరకు రిపోర్టు చేశారు. భర్తీ అయిన సీట్లలో అత్యధికంగా 4 ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో మొదటి దశలో 1,020, రెండో దశలో 166 మంది చేరారు. 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో మొదటి దశలో 744, రెండో దశలో 127 మంది చేరారు. ఇక 34 ప్రైవేటు డిగ్రీ కళాశాలలలో రెండు దశల్లో కలిపి కేవలం 406 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. సీట్ల భర్తీ లేక ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వెలవెల బోతున్నాయి. మరో దశ మాత్రమే ఉండగా.. 25వేల సీట్లు భర్తీ కావాల్సి ఉంది.

వనరులను భవిష్యత్‌

తరాలకు అందించాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: సహజ వనరులను భవిష్యత్‌ తరాలకు అందించాని పీయూ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. లైబ్రరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో వ్యర్థాల ఉత్పత్తి పెరుగుతుందని, వ్యర్థాల నిర్వహణ రీయూజ్‌, రికవరీ, రీసైకిల్‌ విధానంలో జరగాలన్నారు. అవసరానికి మంచి వస్తువులను వినియోగించవద్దని, వస్తువులను తిరిగి వినియోగించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుదన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. కంపోస్టు ఎరువు చెట్ల వ్యర్థాలు ద్వారా కూడా తయారు చేసేందుకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పర్యావరణ పరంగా చైతన్యవంతులు కావాలని సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఇంజినీర్‌ మహ్మద్‌ సమీర్‌, రాజశేఖర్‌, కోఆర్డినేటర్‌ ప్రవీణ, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, కృష్ణయ్య, ఈశ్వర్‌కుమార్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement