మానవపాడు: పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని గుంతలలో వేసి కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా వినియోగించాలని డీఆర్‌డీఓ ముషాయిదాబేగం, జిల్లా వ్యవసాయాధికారి వీరప్ప అన్నారు. గురువారం మండలంలోని పెద్దపోతులపాడులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6, 8, 10 తేదీల్లో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా నేలలోని సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గుతుందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో సేంద్రియ ఎరువుగా మార్చాలని సూచించారు. పొలాల్లో వ్యర్థాలను కాల్చడం చట్టరీత్యా నేరం అని, రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్‌కుమార్, సర్పంచ్ రజాక్, విస్తరణాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


