కాల్వ పనులు పూర్తికాకపోవడంతో రైతులమే సొంతంగా కాల్వలు ఏర్పాటు చేసుకొని పంటలకు నీరు పారించకుంటున్నాం. కాల్వలకు దూరంగా ఉన్న వారికి అలాంటి అవకాశం కూడా లేకుండా పోయింది. ఫీటు కాల్వలు ఏర్పాటు చేస్తేనే రైతులందరికీ మేలు జరుగుతుంది.
– దావూద్, రైతు, అయిజ
ఫీటు కాల్వ పనులు చేపట్టేందుకు అనేక ఆటంకాలు ఉన్నాయి. ముఖ్యంగా భూ సేకరణ చేయలేదు. దీనికి సంబంధించి భూములు కోల్పోతు న్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించ నందున కొంతమంది రైతులు అడ్డుపడుతున్నా రు. ప్రాజెక్ట్ రూపొందించిన సమయంలో కాల్వలకు లైనింగ్ ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్ వే యకపోవడంతో ఆ పనులు చేపట్టడం లేదు. దీ నికోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
– ఇమ్మానుయల్, డీఈ, నెట్టెంపాడు ప్రాజెక్ట్
ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన కాల్వ పను లు నత్తనడకన సాగుతున్నా యి. దీంతో డీజిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకొని సాగునీ రు పారించుకుంటున్నాం. ఇందుకోసం రూ.వేలల్లో ఖర్చవుతుంది. కాల్వ పనులు వెంటనే పూర్తిచేసి సాగునీటి ఇబ్బందు లు తీర్చాలి. – సత్యారెడ్డి, రైతు, అయిజ
●


