ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు మరవలేనివని పదో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ పార్ధసాథిరెడ్డి అన్నారు. మంగళవారం బీచుపల్లి పదో పటాలంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రొ.జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం వివిద విభాగాల్లో ప్రతిభకనబర్చిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరమణ, యూనిట్ మెడికల్ అధికారిణి సాయి, వెల్ఫేర్ అధికారి రాజేశం, ఆర్‌ఐలు రాజు, రాజేశం, నర్సింహరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


