ఏర్పాట్ల పరిశీలన.. | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్ల పరిశీలన..

Jun 3 2026 12:21 AM | Updated on Jun 3 2026 12:21 AM

ధరూరు: మండలంలోని గూడెందొడ్డి రిజర్వాయర్‌ను ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్‌ స్థలంతో పాటు పంప్‌హౌజ్‌కు వెళ్లే మార్గాన్ని చూశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో పాటు ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వారి వెంట అదనపు ఎస్పీ శంకర్‌, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రహీముద్దీన్‌, డీఎస్పీ మొగులయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రగతి, మాజీ వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, కృష్ణకుమార్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement