గద్వాల: జిల్లాలోని జూరాల ప్రాజెక్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను పరిశీలించేందుకు ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్, ఎస్పీ శ్రీనివాసరావు, వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారని, ఇందుకు సంబంధించి హెలీప్యాడ్ స్థలం పరిశీలన, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు వంటివి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులతో చర్చించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఈఈలు సంజీవ్, ప్రగతి పాల్గొన్నారు.
చిట్టీల పేరుతో టోకరా
● ఉలిగేపల్లి గుడిపూజారి నిర్వాహకం
● రూ.10కోట్లకు పైగా ఘారానామోసం
మల్దకల్: అధిక వడ్డీలతో చిట్టీ వ్యాపారం చేస్తూ ఓ వ్యక్తి రూ.10కోట్లకు పైగా మోసం చేసి ఉడాయించిన ఘటన మండలంలోని బిజ్వారంలో సోమవారం చోటు చేసుకుంది. బిజ్వారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ సమీపంలోని మరో గ్రామంలో ఆంజనేయస్వామి గుడి పూజారిగా ఉంటూ ఇరు గ్రామాల ప్రజలతో సత్సంబంధాలు పెంచుకున్నాడు. ఈక్రమంలో చిట్టీలు వేయించుకుని వారికి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో చిట్టీలు వేసిన లబ్ధిదారులు లబోదిబోమంటూ బిజ్వారంలోని అతని ఇంటి వద్దకు చేరుకుని ఆ వ్యక్తిపై ఆరాతీయగా.. 5 రో జుల నుంచి కనిపించకుండాపోవడంతో బాధి తులు ఆవేదన వ్యక్తం చేశారు. బిజ్వారంతోపాటు ఉలిగేపల్లి, దాసరపల్లి, గద్వాల పట్టణం, ధరూరు మండలంలోని 6 గ్రామాల్లో పరిచయస్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో చిట్టీ లు వేయించుకున్నాడు. చిట్టీలతోపాటు చిట్టీలు వేసిన లబ్ధిదారులతో అధిక వడ్డీల ఆశతో ఒ క్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.30లక్షలకు పైగా వడ్డీలకు తీసుకుని వారి నెలనెలా వడ్డీ చెల్లిస్తూ నమ్మకం ఏర్పరచుకున్నాడు. అదే నమ్మకంతో చిట్టీలు వేసిన వారితోపాటు అప్పు లు ఇచ్చినవారిని మోసగించి రాత్రికిరాత్రే కు టుంబ సభ్యులతో ఉడాయించాడు. అప్పులు ఇచ్చినవారు సర్పంచ్‌ను కలిసి తమకు న్యాయ ం చేయాలని విన్నవించారు. తాను చేసేదేమి లేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూ చించారు. ఈ విషయమై మల్దకల్ ఎస్‌ఐ కొండ శ్రీహరిని వివరణ కోరగా చిట్టీలతో ఉడాయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితులు ఎవరూ ఇప్పటి వరకు ఉడాయించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
198 క్వింటాళ్ల
వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు సోమవారం 198 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,800, కనిష్టంగా రూ.5,469, సరాసరిగా రూ.6,865 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. సరాసరిగా రూ.5,759 ధర పలికింది.


