ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి ఉత్తమ పోలీస్‌ సేవా పతకాలు

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖలో పని చేస్తున్న అధికారుల, సిబ్బంది పనితీరుకు గుర్తింపుగా సేవా పతకాలు ప్రకటించింది. అందులో ఆరుగురు ఉత్తమ సేవా పతకాలు పొందారు. వారిలో మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న ఎం.పోశెట్టి, ఇంటలిజెన్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కె.శ్రీనివాస్‌రావు, వనపర్తి వీఆర్‌ ఎస్‌ఐ ఎస్‌.సుబ్బరాజు, గద్వాల జిల్లాలో డీఎస్‌బీలో ఏఎస్‌ఐ శ్రీనివాసులు, పదో బెటాలియన్‌ ఏఆర్‌ ఎస్‌ఐ శివరావు, నారాయణపేట జిల్లాలో ఏఆర్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ నర్సిరెడ్డి ఉన్నారు.

● మహబూబ్‌నగర్‌ జిల్లాలో సేవా పతకం పొందిన వారిలో ఆర్‌ఐ క్రిష్ణయ్య, టూటౌన్‌ సీఐ ఇజాజుద్దీన్‌, ఏఆర్‌ ఎస్‌ఐ శ్రీరాములు, దేవరకద్ర హెడ్‌కానిస్టేబుల్స్‌ రాజశేఖర్‌, మహ్మద్‌ గఫర్‌, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్స్‌ ఆంజనేయులు, శ్రీనివాసులు, శ్రీరాములు, నర్సింహులు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌గౌడ్‌, ఇంటలిజెన్స్‌లో సీఐ సాయికుమార్‌, ఏఎస్‌ఐ ప్రభాకర్‌రావు, కానిస్టేబుల్‌ పర్వతచారి, టెక్నికల్‌ విభాగంలో ఐటీ సీఐ ప్రకాష్‌, ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఆత్మకూర్‌ సీఐ శివకుమార్‌, ఏఎస్‌ఐ రోశన్న, ఏఆర్‌ ఎస్‌ఐ జాకీర్‌ హుస్సెన్‌, పెద్దమందడి హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మప్పలు ఉన్నారు. ఇక గద్వాల జిల్లాలో గద్వాల సీఐ సీహెచ్‌ నాగేశ్వర్‌రెడ్డి, కోదాండపూర్‌ ఏఎస్‌ఐ శ్రీనివాసులుగౌడ్‌, మానవపాడు ఏఎస్‌ఐ మహ్మద్‌ జమీరుద్దీన్‌, ఇటిక్యాల ఏఎస్‌ఐ వెంట్‌రామిరెడ్డి ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నాగర్‌కర్నూల్‌ డీసీఆర్‌బీ సీఐ ఉపేందర్‌రావు, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రాజు, ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు, తెలకపల్లి మహిళ కానిస్టేబుల్‌ పద్మ ఉన్నారు. ఇక నారాయణపేట జిల్లాలో కోస్గి సీఐ సైదులు,క్రిష్ణ ఏఎస్‌ఐ సురేందర్‌బాబు, ఊట్కూర్‌ ఏఎస్‌ఐ సాయిబాబ, హెడ్‌కానిస్టేబుల్‌ బాలరాజు, ధన్వాడ ఏఎస్‌ఐ ఎండీ ముస్తాక్‌ అలీ, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్స్‌ మురళీధర్‌, వెంకటేశ్వర్లు, ఎండీ లయిక్‌ అహ్మద్‌ సేవా పతకాలు అందుకోనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement