గద్వాల: రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకలకు కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు పోలీసు బందోబస్తును ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు, క్రీడా వ్యవహారాల ఇన్‌చార్జి ఏపీ జితేందర్‌రెడ్డి హాజరుకానున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.


