మానవపాడు: రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉద్యమకారులకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుమ్మ గోవర్ధన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు గార్లపాడు భూషణం, గద్వా ల జిల్లా కార్యదర్శి దుబ్బన్న డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది జైలుకు జీవితం గడిపామన్నారు. ఉద్యమకాలంలో జిల్లా వ్యాప్తంగా దిగ్బంధం, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. హామీలు నెరవేర్చేంత వరకు రాష్ట్రం ప్రభుత్వంపై ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంకర్‌నాయుడు, మండల ఉపాధ్యక్షుడు వివేకానందం, మండల ప్రధాన కార్యదర్శి రఘు, మండల కార్యదర్శి జయ్యన్న, నరసింహులు, అయ్యన్న, మండల సలహాదారుడు మాజీ ఎంపీటీసీ అయ్యన్న, శేఖర్ పాల్గొన్నారు.


