జనగణన–2027లో భాగంగా ఇళ్ల గణనను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వివరాలను సేకరించేందుకు వచ్చిన స్థానిక బ్లాక్ అధికారులకు కలెక్టర్ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు, ప్రజలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జనగణన దోహదపడుతుందన్నారు. ప్రజలు సంబంధిత అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన వివరాలను తెలియజేసి జిల్లాలో సెన్సెస్ విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు.


