మామిడి తోటల కారణంగా ఈసారి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. 20 ఎకరాలు లీజుకు, సొంతంగా 10 ఎకరాలు మొత్తం 30 ఎకరాలకు గాను రూ.15 లక్షల దాకా పెట్టుబడులు పెట్టాం. ఈసారి పూత బాగానే వచ్చినా.. తర్వాత చీడపీడల కారణంగా పిందెలు రాలిపోయాయి. ఉన్న మామిడి కాయలను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళ్తే.. 22 కిలోల బాక్స్ రూ.500–700 వరకు కొన్నారు. మామిడి కాయలను నిల్వ ఉంచుకునేందుకు వీలు కాక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేదు. – తెలుగు తిమ్మప్ప, కౌలురైతు, గట్టు


