పోక్సో.. కాస్కో | - | Sakshi
Sakshi News home page

పోక్సో.. కాస్కో

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

ఉమ్మడి జిల్లాలో బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు

2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సోకేసులు

ఏడేళ్ల వ్యవధిలో ఒక్క మహబూబ్‌నగర్‌లోనే 758 కేసులు నమోదు

కీచకులుగా మారుతున్న

కొందరు ఉపాధ్యాయులు

పకడ్బందీగా చట్టం అమలుతో నిందితులకు కఠిన శిక్షలు

మహబూబ్‌నగర్‌ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్‌ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు.

గురువులు సైతం వక్ర బుద్ధి

ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి.

బెయిల్‌ దొరకడం కష్టమే..

పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్‌ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి.

● ‘నారాయణపేట జిల్లా మద్దూరు

మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత

పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు స్వామి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని రిమాండ్‌కు తరలించారు.’

● మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధర్మాపూర్‌ పాఠశాలతోపాటు షాసాబ్‌గుట్ట, వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో వీరన్నపేట హైస్కూల్‌లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి.’

2020 నుంచి జిల్లాల

వారీగా నమోదైన

పోక్సో కేసులు ఇలా...

మహబూబ్‌నగర్‌

జోగుళాంబ గద్వాల

నారాయణపేట

నాగర్‌కర్నూల్‌

వనపర్తి

అవగాహన

కల్పిస్తున్నాం..

అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్‌ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి. – వెంకటేశ్వర్లు,

డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

2026

28

2025

51

2024

44

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement