4, 5 తేదీల్లో ప్రశిక్షణ | - | Sakshi
Sakshi News home page

4, 5 తేదీల్లో ప్రశిక్షణ

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

గద్వాల: జిల్లాకేంద్రంలో వచ్చే నెల 4, 5 తేదీ ల్లో జిల్లా ప్రశిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నేత, జిల్లా ప్రశిక్షణ ఇన్‌చార్జి అయ్యంగారి ప్రభాకర్‌ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో నిర్వహించిన సన్నాహాక కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. జిల్లా కేంద్రంలోని ఎస్‌వీ ఈవెంట్‌ హాల్‌లో రెండు రోజులపాటు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రశిక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణతో పాటు జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, నాయకులు మొదలుకొని 200 మంది హాజరవుతారన్నారు. మొత్తం 11 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మూడేళ్లకోసారి జాతీయ, జిల్లా, మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం ఒక్క బీజేపీకే సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవి, కేకే, జయశ్రీ, సమతగౌడ్‌, చంద్రశేఖర్‌ ఉన్నారు.

రాజకీయ వేధింపులకు భయపడం : సీపీఎం

గద్వాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకుని రాజకీయ వేధింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్‌పై ఈడీ దాడులకు వ్యతిరేకంగా గురువారం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో కలిసి చట్టవిరుద్ధ పనులు మొదలుపెట్టారన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను అడ్డుపెట్టుకొని దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. రాష్ట్రానికి 15 సంత్సరాలు నీతివంతమైన పాలన అందించిన మాజీ సీఎంను ఉద్దేశపూర్వకంగా అవమానపర్చడానికి ఈడీ దాడులు చేయడం తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం నాయకత్వాన్ని అక్రమ కేసులతో బలహీనపర్చాలనుకోవడం సరైన విధానం కాదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పేరు నర్సింహ, రంగన్న, రామకృష్ణ అంజి, నర్సింహ, రామాంజనేయులు పాల్గొన్నారు.

ఆర్టీసీ విలీనంతోనే ఉద్యోగ భద్రత

కందనూలు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోనే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గత నెలలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంపై ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. అదే విధంగా 2021 వేతన సవరణలో ఉన్నా తేడాలను సవరించాలని.. విలీన కమిటీలో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, రీజియన్‌ కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు సుమలత, పద్మ, కృష్ణయ్య ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement