● మసీదులు, ఈద్గాల వద్ద
ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
● శుభాకాంక్షలు తెలియజేసిన
ప్రజాప్రతినిధులు
గద్వాల: జిల్లావ్యాప్తంగా గురువారం బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రా లు, గ్రామాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన ముస్లిం నాయకుల ఇళ్లకు వెళ్లి తేనేటి విందు స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి, వైస్‌చైర్మన్ శంకర్, నాయకులు సుభాన్, రామన్‌గౌడ్, భాస్కర్, గోవిందు, మాజీద్ పాల్గొన్నారు.


