సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

కందనూలు: నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–8 పరిధిలోని వట్టెం అతిథిగృహంలో కలెక్టర్లు హేమంత కేశవ్‌ పాటిల్‌, ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి పాలమూరు ఎత్తిపోతల, ఎంజీకేఎల్‌ఐ, డిండి, ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, అచ్చంపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌, మార్కండేయ, కర్నెతండా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా చేపట్టిన పనులు, భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల అనుబంధ పనులు, పంప్‌హౌజ్‌ల ఏర్పాటు, విద్యుత్‌ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోగా పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

నిర్లక్ష్యాన్ని సహించం..

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. పనుల నాణ్యత విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

వారం రోజుల్లో

భూసేకరణ పూర్తిచేయాలి

త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు

సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ

మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement