అయిజ:మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని.. రైతుల నుంచి సేకరించిన ధాన్యా న్ని ఎప్పటికప్పుడు గోదాంలకు తరలించాలని డీసీఓ శ్రీనివాస్ అన్నారు. అయిజ వ్యవసాయ మార్కెట్ సబ్‌యార్డులో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకోవడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రంలో హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్నలను బుధవారం నాటికి గోదాంలకు తరలిస్తామన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.
29న ఉద్యోగ మేళా
కల్వకుర్తి: ప్రజాపాలన 99 రోజుల వారోత్సవాలలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఐటీఐ కన్వీనర్ జయమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఆపై చదివిన నిరుద్యోగులకు ఈ నెల 29వ తేదీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. జాబ్‌మేళాలో 10 ప్ర ముఖ కంపెనీలు పాల్గొంటాయని, ఐటీఐ చదివిన ట్రైనీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. అభ్యర్థులు విధిగా వారి బయోడేటా, ఒరిజినల్ విద్యార్హత పత్రాలు,ఆధార్ కా ర్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, అన్నింటి జిరా క్స్ పత్రాలు తీసుకొని కల్వకుర్తిలోని ఐటీఐ కళా శాలలో హాజరుకావాలని కోరారు. వివరాలకు 8500461186, 9848759326, 8801567267 నంబర్‌లలో సంప్రదించాలని కోరారు.
పీఎం బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు
మహబూబ్‌నగర్ రూరల్: పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాహసం, క్రీడలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, సైన్స్– టెక్నాలజీ, కళలు, సంస్కృతి వంటి రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాల, బాలికలకు ఈ అవార్డులు అందజేయనున్నారు. 5– 18 ఏళ్లలోపు పిల్లలు ఆన్‌లైన్‌లో https://awards.gov.in వెబ్‌సైట్ ద్వారా జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలబాలికల విజయాలు, సేవా కార్యక్రమాలు, విద్య, క్రీడా ప్రతిభ తదితర వివరాలతో చేసిన దరఖాస్తు అక్‌నాలెడ్జ్‌మెంట్ ప్రతిని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో జూలై 31లోగా అందజేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


