పూర్తి వివరాలు
తెలుసుకుంటా : కలెక్టర్
విజిలెన్స్ అధికారుల విచారణ..
2019లో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా కేంద్రం ప్రకటన
–8లో u
గద్వాల: కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు జోగుళాంబ గద్వాల బహిరంగ మలవిసర్జన రహిత (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ) జిల్లా కాదా..? అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించినట్లు..? అయితే కేంద్ర ప్రభుత్వానిదే తప్పుడు ప్రకటనా..? లేక జిల్లా లో ఉన్న అధికారులే కేంద్రానికి తప్పుడు సమాచా రం ఇచ్చి, తప్పుదోవ పట్టించారా..? ఇలాంటి ప్రశ్న లు ఉత్పన్నం కావడానికి ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న జాతీయ జనగణన–2027 ప్రక్రియే కారణం. ఇదేమిటి జనగణనకు, బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాకు ఉన్న లింకేమిటని ఆలోచిస్తున్నారా..? అయితే ‘సాక్షి’ కథనాన్ని పూర్తిగా చదవండి.
● ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని.. ఎవరూ బహిరంగ మలవిసర్జనకు వెళ్లరాదని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా 2014 అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ మిషన్ చేపట్టగా.. అదే సంవత్సరం జిల్లాలో మొదటి విడతగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టినట్లు అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాను 2019 అక్టోబర్ 2 నాటికి వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేసుకున్న (ఓడీఎఫ్) జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కూడా జిల్లాను ఓడీఎఫ్ కిందనే పరిగణిస్తూ వస్తున్నారు. నిర్మించుకున్న మరుగుదొడ్లను నిరంతర వినియోగం ద్వారా ఘన ద్రవవ్యర్థాల నిర్వహణ లక్ష్యాలతో ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
జనగణనలో తేలిన లెక్క..
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 1,32,261 నివాసగృహాలు ఉన్నాయి. మొత్తం 6,09,990 జనాభాకు గాను పురుషులు 3,09,274 మంది, మహిళలు 3,00,716 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,46,813 మంది, పట్టణ ప్రాంతంలో 63,177మంది నివాసం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎనిమిదేళ్ల కాలంలో ఇళ్ల సంఖ్య పెరిగింది. నూతన ఇళ్లలో కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారని జిల్లా అధికారులు కేంద్రానికి నివేదిక పంపడంతో ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించింది. ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్ కిందనే జిల్లాను పరిగణిస్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభు త్వం చేపట్టిన జాతీయ జనగణన–2027 ప్రక్రియ లో గ్రామీణ ప్రాంతాల్లో 20శాతం మేర వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. ఇదే అంశాన్ని పేర్కొటూ జనగణన చేపడుతున్న అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.
ఓడీఎఫ్ విషయమై కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను జిల్లాకు కొత్తగా వచ్చానని, ప్రస్తుతం రెండురోజుల పాటు సెలవుల్లో ఉన్నానని తెలిపారు. 2019కి సంబంధించిన అంశం కావడంతో సమగ్ర వివరాలు తెలుసుకుంటానని బదులిచ్చారు.
జనగణన వివరాల నమోదుపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం.. జిల్లాలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్డు లేకపోవడం ఏమిటని ఆరా తీసింది. దీనిపై రెండు రోజుల క్రితం కేంద్ర విజిలెన్స్ అధికారులు జనగణనలో నమోదు చేసిన వివరాల ఆధారంగా ఆయా గ్రామాల్లో రహస్యంగా విచారణ జరిపినట్లు సమాచారం. వీరి విచారణలో మరుగుదొడ్లు లేవనే విషయం తేలినట్లు తెలిసింది. మరి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసినట్లు చూపించి ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 12వేలు ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే దానిపై పూర్తి విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం తెలిసిన అధికారులు ఎవరిమీద ఎలాంటి పిడుగు పడుతుందో అని బెంబేలెత్తిపోతున్నట్లు తెలిసింది. ఈ విచారణలో అవినీతీపరులు బయటకు వస్తారా..? లేక పలుకుబడి పనిచేసి తప్పించుకుంటారో వేచి చూడాలి.
జాతీయ జనగణనలో 20శాతం పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని వెలుగులోకి
రహస్య విచారణ చేపట్టిన విజిలెన్స్
అధికారులు
తప్పుడు నివేదికలతో కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల్లో గుబులు


