గద్వాల: మాదాసి, మాదారి కురువలను ఎస్సీలుగా గుర్తించి.. కుల ధ్రువపత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు కురువ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. జాతీయ జనగణనలో మాదాసి, మాదారి కురువలను ఎస్సీలుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 244 కులాలకు లేని ఆంక్షలు ఒక్క మాదాసి, మాదారి కురువలకు మాత్రమే పెట్టడం సరికాదన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మధుమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, రవిప్రకాశ్, మహేశ్, కిష్టప్ప, రంగప్ప, నర్సింహులు, రాజేశ్, రామాంజనేయులు, తిరుమలేష్ పాల్గొన్నారు.


