
విక్రయాలపై దృష్టి సారించాలి..
విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పలు ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, టై, బెల్టుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లోని పలు పుస్తకాల పబ్లిషర్స్‌తో పాఠశాల యజమాన్యాలు కుమ్మకై ్క తమ ఇష్టమొచ్చిన ధరలకు విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ అంటగడుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్ విక్రయాలపై దృష్టి సారించాలి.
– బొడ్డు స్మరన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
చర్యలు తీసుకుంటాం..
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయించకూడదు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా స్టేషనరీ వ్యాపారం చేయడం లాంటి వాటికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
– రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి
●