హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తారా.. ట్రంప్‌నకు ఇరాన్‌ వార్నింగ్‌ | Picture abhi baaki hai Iran warning to US on Hormuz | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తారా.. ట్రంప్‌నకు ఇరాన్‌ వార్నింగ్‌

Apr 14 2026 5:14 PM | Updated on Apr 14 2026 5:44 PM

Picture abhi baaki hai Iran warning to US on Hormuz

టెహ్రాన్‌ : శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంగా అమెరికా హర్మూజ్‌ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్‌కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతున్నాయి. ఫలితంగా పశ్చిమాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ స్టైల్లో అభి తొహ్ సిర్ఫ్ ట్రైలర్ హాయ్, పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ట్రంప్‌నకు ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. 

అందులో ఇరాన్ నావికాదళం ఉపయోగించే చిన్న, వేగవంతమైన క్షిపణి పడవల గురించి ప్రస్తావిస్తూ.. అవును, ఆ వేగవంతమైన క్షిపణి పడవలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ నావికాదళం ‘నాశనమైపోయింది’ అని ట్రంప్ పదేపదే చెప్పడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు క్షిపణుల సమూహం మిమ్మల్ని ఎంత త్వరగా కట్టడి చేయగలదో తెలుసుకోబోతున్నారు’ అని పేర్కొంది. 

పశ్చిమాలో యుద్ధం కారణంగా ఇరాన్ రూ.25 లక్షల కోట్లు నష్టపోయింది. ఇరాన్‌ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేలా అమెరికా హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇందుకోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన యూఎస్‌ఎస్‌ అబ్రహీం లింకన్‌ కూడా ఇరాన్ తీరప్రాంతంలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైతే దాడికి దిగే అవకాశం ఉంది. 

ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా పాకిస్థాన్‌లో ఇరాన్‌ -అమెరికా దేశాలు శాంతి చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్క్ష్యంగా అమెరికా హర్మూజ్‌ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్‌కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతాయి. తద్వారా చమురు అమ్ముకుని ఆర్థికంగా బలంగా ఉన్న ఇరాన్‌కు అమెరికా తీసుకుంటున్న చర్యలతో సతమతమవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement