రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదు
వాషింగ్టన్: అమెరికాలోని నెవాడా రాష్ట్ర రాజధాని కార్సన్ సిటీకి తూర్పున ఉన్న గ్రామీణ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 5.7గా రికార్డయ్యింది. సాయంత్రం 6.30 గంటలకు కొద్దిసేపటి ముందు భూప్రకంపనలు నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ భూకంప కేంద్రం సిల్వర్ స్ప్రింగ్స్ పట్టణానికి తూర్పున 20.7 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప ప్రభావం వల్ల ఫాలన్ పట్టణంలోని ఒక కిరాణా దుకాణంలో గాజు ముక్కలు, ఆహార పదార్థాలు చెల్లాచెదురుగా పడిఉన్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాదాపు ఒక నిమిషంపాటు భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు తెలిపారు.


