దుబాయ్: ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు నూతన కార్యదర్శిగా మొహమ్మద్ బఘేర్ జోల్‌ఘదర్‌ను నియమించారు. ఈయన గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్స్ప్ (ఐఆర్‌జీసీ)లో గతంలో కమాండర్‌గా సేవలందించారు. ఐఆర్‌జీసీలో ఉంటూ ఈయన గతంలో బ్రిగేడియర్ జనరల్ స్థాయికి ఎదిగారు.
ఇప్పటికే జోల్‌ఘదర్ ఇరాన్ పార్లమెంట్‌కు, 12 మంది సభ్యులుండే గార్డియన్ కౌన్సిల్‌కు మధ్య పొడచూపే విబేధాలను పరిష్కరించే ఇరాన్ ఎక్స్‌పిడియన్సీ కౌన్సిల్‌కు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలా లారిజానీ ఇటీవల దాడుల్లో చనిపోవడంతో జోల్‌ఘదర్‌ను ఎంపికచేశారు.


