ఇరాన్‌ యుద్దానికి బ్రేక్‌: ట్రంప్‌ | Donald Trump Agree Two Week Ceasefire For Iran | Sakshi
Sakshi News home page

Iran War: 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు

Apr 8 2026 4:31 AM | Updated on Apr 8 2026 7:24 AM

Donald Trump Agree Two Week Ceasefire For Iran

ఇరాన్ నాగరికత అనేది పూర్తిగా లేకుండా చేస్తానని చెప్పిన అమెరికా అ‍ధ్యక్షుడు ట్రంప్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. ఇప్పటికే విధించిన డెడ్‌లైన్‌ని మరో రెండు వారాల పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ దీనిని ప్రతిపాదించగా..దీనికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ఇరాన్ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయి. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. టెహ్రాన్‌తో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్ నుంచి వాషింగ్టన్‌కి 10 సూత్రాల ప్రతిపాదన అందిందని ట్రంప్ చెప్పారు. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన ట్రంప్.. ఇరాన్ ప్రతిపాదనలు వర్కబుల్ అని పేర్కొన్నారు. అలాగే.. 

కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. ఒకవేళ 14 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ పున ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గనున్నాయి.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement