
Cervical Spondylosis- Ayurvedic Treatment: మెడ నొప్పి బాధిస్తోందా? మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? సర్వైకల్ స్పాండిలోసిస్ అని డాక్టర్ చెప్పారా? మెడ ప్రాంతంలోని వెన్నుపూసల డిస్కులు స్లిప్ అయినప్పుడు నరం మీద ఒత్తిడి పడి, భుజం లోపలకు నొప్పి ప్రసరించే అవకాశం ఉంది. దీనిని ’గ్రీవాస్థంభం’ అలోపతిలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు.
అటువంటి సందర్భాలలో భుజంలో నొప్పి ఉంటుంది. తప్పితే భుజాన్ని కదిలించడంలోగాని, తిప్పడంలోగాని ఇబ్బంది ఏదీ ఉండదు. సమస్య భుజంలో కాకుండా మెడలో ఉంటుంది కాబట్టి సర్వైకల్ స్పాండిలోసిస్ కు చికిత్స చేస్తే భుజం నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది.
సలహాలు :
1. వేపాకు, వేప పువ్వులు వీటి రసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండుపూటలా తీసుకోవాలి.
2. దురదగొండి గింజల కషాయాన్ని అరకప్పు చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.
3. బలామూలం (తుత్తురు బెండ) వేళ్ళను కషాయంకాచి రెండు చెంచాల కశాయానికి ఒక చెంచా నువ్వుల నూనె కలిపి ఆహారం తర్వాత ముక్కులో డ్రాప్స్ గా (నాలుగైదు చుక్కలు) వేసుకోవాలి.
4. నువ్వుల నూనెకు తగినంత కర్పూరం కలిపి మెడమీద మసాజ్ చేసుకోవాలి.
5. వెల్లుల్లి గర్భాలను రోజుకు రెండు చొప్పున ముద్దగా నూరి పాలతో కలిపి తీసుకోవాలి. సింహనాదగుగ్గులు, మహావాతవిధ్వంసినీ రసం, మహారాస్నాదిక్వాథం.
ఈ జాగ్రత్తలు పాటిస్తూనే కావాల్సినంత విశ్రాంతి, శరీర జాగ్రత్తలు, పరిమితంగా వ్యాయామాలు చేస్తే తొందరగా నొప్పి తగ్గుతుంది.
-డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు
చదవండి: Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి..
Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే..