Police Arrested Two People Who Sexually Assaulted A Hijra After Ingesting Drugs - Sakshi
Sakshi News home page

Molestation Assault To Hijra: మత్తు మాత్రలు ఇచ్చి హిజ్రాపై లైంగిక దాడి

Jul 19 2023 10:13 AM | Updated on Jul 19 2023 11:25 AM

molestation assault to Hijra - Sakshi

మత్తుమాత్రులు మింగించి హిజ్రాపై లైంగిక దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

తమిళనాడు: మత్తుమాత్రులు మింగించి హిజ్రాపై లైంగిక దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పెరంబూరు ప్రాంతానికి చెందిన జన్నీ, బ్లసికా హిజ్రాలు. వీరిద్దరూ సోమవారం రాత్రి మధురవాయిల్‌ పూందమల్లి హైవే రోడ్లు జీసస్‌ కాల్స్‌ వద్ద నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆటోలో వచ్చిన మద్యం మత్తులో వున్న ఇద్దరు బ్లసికాతో మాటలు కలిపారు. తర్వాత హఠాత్తుగా కత్తిని చూపెట్టి బ్లసికాను ఆటోలు బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది.

 ఇది చూసి జన్నీ వెంటనే మధురవాయిలు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ సుబ్రమని సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సెట్టియార్‌ అగరం ప్రాంతంలో వున్నట్టు గుర్తించారు.

 అక్కడికి వెళ్లి మద్యం మత్తులో ఉన్న ఆవడికి చెందిన జగన్, రామాపురానికి చెందిన దినేష్ లను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి బ్లసికాను విడిపించారు. ఆ సమయంలో మత్తు మధ్యలో యువకులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మహారాజాపై దాడి చేసి తప్పించుకుని పోవడానికి ప్రయతి్నంచారు. పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. బ్లసికాను చికిత్స కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement