ప్రేమ విఫలమైందని ఆత్మహత్యాయత్నం 

Man tries To Eliminate Himself Over Love Affair Issue Guntur - Sakshi

గుంటూరు రూరల్‌: ప్రేమ విఫలమైందని యువకుడు చేతి మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని నల్లపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నాగకుమారి తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేట సమీపంలోని యలమంద గ్రామానికి చెందిన ధూళిపాళ్ల మహేష్‌ ఢిల్లీ సమీపంలో నోయిడాలో ఉద్యోగం చేస్తుంటాడు. గత నెలలో గ్రామంలో తిరునాళ్ల నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు.

అనంతరం తాను ప్రేమించిన యువతి వద్దకు వెళ్లగా ఆమె వ్యతిరేకించడంతో సోమవారం మధ్యాహ్నం గుంటూరు అమరావతి రోడ్డులోని ఐడీ హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న లాడ్జిలో రూము తీసుకుని చేతి మణికట్టు వద్ద కోసుకుని, ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నిస్తూ వీడియో చిత్రీకరించాడు. హోటల్‌ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి అతన్ని బయటికి తీసుకొచ్చి జీజీహెచ్‌కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

చదవండి: పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి, నాలుగు నెలలకే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top