అనారోగ్యంతో భార్యభర్తల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో భార్యభర్తల ఆత్మహత్య

Nov 26 2024 2:01 AM | Updated on Nov 26 2024 8:06 AM

-

– మేలుందొడ్డిలో విషాదం

పుంగనూరు: అనారోగ్యంతో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మేలుందొడ్డిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మేలుందొడ్డి గ్రామంలో నివాసం ఉన్న శ్రీనివాసులు(46), అతని భార్య నీలమ్మ(43) టైలర్లుగా పనిచేస్తున్నారు. గతంలో బెంగళూరులో ఉంటూ ఇటీవలే గ్రామానికి వచ్చి నివాసం ఉన్నారు. ఇలా ఉండగా శ్రీనివాసులు కిడ్నీ వ్యాధి ఉండడంతో అప్పులు చేసి చికిత్స చేయించారు. 

కానీ ఫలితం లేకపోయింది. ఇలా ఉండగా భార్యభర్తలు ఇరువురు మాట్లాడుకుని ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని బైరేబండకు వెళ్లే మార్గంలో చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం గ్రామస్తులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు , ఎస్‌ఐ లోకేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని, పరిశీలించి, , మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement