భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు | Stock Market closing April 15; Sensex jumps 1264 points | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మాటతో.. దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు

Apr 15 2026 3:41 PM | Updated on Apr 15 2026 3:54 PM

Stock Market closing April 15; Sensex jumps 1264 points

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ తో యుద్ధం ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరువాత నిఫ్టీ 50, సెన్సెక్స్ భారీగా ఎగిశాయి.

నిఫ్టీ 1.63 శాతం లేదా 388.65 పాయింట్ల లాభంతో 24,231.30 వద్ద, సెన్సెక్స్ 1.64 శాతం లేదా 1,264 పాయింట్లు పెరిగి 78,111.24 వద్ద ముగిశాయి.

ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.20 శాతం, 2.35 శాతం పెరిగాయి.

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్ టాప్ గెయినర్‌గా  నిలిచింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచింది.

Advertisement
 
Advertisement
Advertisement