ఆ ఉద్యోగ అవకాశాలను నమ్మొద్దు - ఆదాయపన్ను శాఖ

Income Tax Department Cautions Fraud Job Offers On Fake Websites - Sakshi

న్యూఢిల్లీ: అక్రమ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ప్రకటనలను నమ్మవద్దంటూ ప్రజలను ఆదాయపన్ను శాఖ తాజాగా హెచ్చరించింది. ఉద్యోగార్థులు ఎస్‌ఎస్‌సీ లేదా సంబంధిత శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే విశ్వసించమంటూ సూచించింది. వీటిలో వెలువడే ఆఫర్లకు మాత్రమే స్పందించవలసిందిగా సలహా ఇచ్చింది. కొంతమంది మోసగాళ్లు ఉద్యోగాలు ఆశిస్తున్నవారికి తప్పుడు అవకాశాలు సృష్టిస్తున్నట్లు పేర్కొంది.

నకిలీ అపాయింట్‌మెంట్‌ లేఖలు అందించే ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ట్వీట్‌ ద్వారా హెచ్చరించింది. ఆదాయపన్ను(ఐటీ) శాఖలో ఉద్యోగాలంటూ కొంతమంది వంచిస్తున్నట్లు ప్రజలనుద్దేశించి జారీ చేసిన నోటీసులో పేర్కొంది. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి ఉద్యోగాలన్నింటినీ ప్రత్యక్షంగా ఎస్‌ఎస్‌సీ ద్వారానే భర్తి చేస్తామని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉద్యోగ సంబంధ నోటిఫికేషన్లు, ఫలితాలు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top