బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్! | BYD New Denza Z Details | Sakshi
Sakshi News home page

బీవైడీ కొత్త కారు.. 2 సెకన్లలో 100 కిమీ స్పీడ్!

Apr 27 2026 6:37 PM | Updated on Apr 27 2026 6:51 PM

BYD New Denza Z Details

చైనా కార్ల తయారీ దిగ్గజం బీవైడీ సరికొత్త కారు 'డెంజా జెడ్' (Denza Z)ను ఆవిష్కరించింది. మసెరటి గ్రాన్‌కాబ్రియో ఫోల్గోర్‌కు గట్టి పోటీని ఇచ్చే విధంగా రూపు దిద్దుకున్న ఈ కారును కంపెనీ 2026 బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో ఆవిష్కరించింది.

బీవైడీ కంపెనీ ప్రధానంగా.. ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని దీనిని విఫణిలో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. డెంజా జెడ్ ఆకట్టుకునే స్టైల్ కలిగి.. అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. ఇది కూపే, కన్వర్టిబుల్, ట్రాక్-ఫోకస్డ్ వేరియంట్లలో లభించనుంది.

2026 బీజింగ్ ఆటో షోలో కనిపించిన డెంజా జెడ్ ఎలక్ట్రిక్ కారు సరికొత్త రంగులో ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి మసెరటి కారు మాదిరిగా కనిపించే ఈ వాహనం.. ఎక్కువ ఫ్యాబ్రిక్ పొందునట్లు తెలుస్తోంది.

డెంజా జెడ్ సిరీస్ మూడు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇవి ఏడబ్ల్యుడీ సామర్థ్యాలను కలిగి సుమారు 1,000 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేలా తయారైంది. ఇది కేవలం రెండు సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ కారు.

ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!

కంపెనీ దీనిని చైనా షోరూమ్‌లలోకి చేర్చడానికి ముందే.. యూరప్, ఇతర దేశాల్లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర 400,000-500,000 యెన్ల (58,600-73,200 డాలర్లు) వరకు ఉంటుందని అంచనా. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement