వందల కోట్ల కొనుగోలు, అపోలో చేతికి నయతి హెల్త్‌కేర్ ఆస్పత్రి!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ (ఏహెచ్‌ఈఎల్) ఉత్తరాదిలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నయతి హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ ఎన్‌సీఆర్‌కి గురుగ్రామ్‌లో ఉన్న ఆస్పత్రి అసెట్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
ఈ డీల్ విలువ రూ. 450 కోట్లు. 5.3 ఎకరాల్లోని ఈ కాంప్లెక్స్‌ను 650 పడకల వరకూ విస్తరించే అవకాశం ఉంటుందని ఏహెచ్‌ఈఎల్ తెలిపింది. దీన్ని 24 నెలల్లో సమగ్ర హెల్త్‌కేర్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నట్లు అపోలో హాస్పి టల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు.
సంబంధిత వార్తలు